నేడు జననేత వైఎస్ జగన్ పర్యటన | today YS jagan mohan reddy's tour | Sakshi
Sakshi News home page

నేడు జననేత వైఎస్ జగన్ పర్యటన

Nov 27 2013 1:25 AM | Updated on Jul 25 2018 4:09 PM

జిల్లాలో హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించనున్నారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు :  జిల్లాలో హెలెన్ తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. పంట పొలాలను చూసి బాధిత రైతులను పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఆయన నరసాపురం చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు నరసాపురంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభిస్తారు. నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న వరి తదితర పంటలను పరిశీలించి రైతులను పరామర్శిస్తారు.
 పర్యటన షెడ్యూల్ ఇదీ..
 నరసాపురం నియోజకవర్గంలో..
 సారవ : దెబ్బతిన్న వరి పొలాల పరిశీలిస్తారు.
 పెదమైనవానిలంక : సముద్రపు కోతకు గురైన ప్రాంతం పరిశీలిస్తారు. మత్స్యకారులను పరామర్శిస్తారు.
 రామన్నపాలెం : దెబ్బతిన్న కూరగాయల తోటలను పరిశీలిస్తారు. అక్కడి రైతులకు పరామర్శిస్తారు.
 పాలకొల్లు నియోజకవర్గంలో..
 దిగమర్రు: దెబ్బతిన్న వరి పొలాల పరిశీలిస్తారు.
 జిన్నూరు : పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శిస్తారు.
 వేడంగి : అరటి తోటలు, వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement