
కాకినాడ నగర పోరు నేడే
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నేడు పోలింగ్ జరగనుంది.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విస్తృత ప్రచారం నిర్వహించాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రెండు రోజులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక రోజు నగరంలో ప్రచారం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు సైతం నగరంలో పర్యటించారు. మొత్తం 50 వార్డుల్లో 48 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రెండు వార్డులకు కోర్టు వ్యాజ్యం మూలంగా ఎన్నికలు జరగడం లేదు. కాగా ఓట్ల లెక్కింపు సెప్టెంబరు 1వ తేదీన జరగనుంది.