నేడు మెడికల్ స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్ | Today is Special category of Medical Counseling | Sakshi
Sakshi News home page

నేడు మెడికల్ స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్

Sep 19 2014 2:59 AM | Updated on Sep 2 2017 1:35 PM

మెడికల్ (ఎంబీబీఎస్/బీడీఎస్) కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ అభ్యర్థులకు శుక్రవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

విజయవాడ: మెడికల్ (ఎంబీబీఎస్/బీడీఎస్) కౌన్సెలింగ్‌లో భాగంగా ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ అభ్యర్థులకు శుక్రవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ కేటగిరీకి 46 ఎంబీబీఎస్, 11 బీడీఎస్ సీట్లు.. క్యాప్(ఆర్మీ) కేటగిరీకి 46 ఎంబీబీఎస్, 11 బీడీఎస్ సీట్లు.. పీహెచ్(వికలాంగ) అభ్యర్థులకు 133 ఎంబీబీఎస్, 42 బీడీఎస్ సీట్లు.. పీఎంసీ (పోలీసు మార్టిరీస్ చిల్డ్రన్స్) కేటగిరీకి 7 ఎంబీబీఎస్, 2 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కౌన్సెలింగ్ తర్వాత మిగిలే సీట్లతో పాటు మొదటి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన 5 ఎంబీబీఎస్, 349 బీడీఎస్ సీట్లను ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే రెండో విడత కౌన్సెలింగ్‌కు బదలాయిస్తారు. శనివారం నుంచి  24వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement