నేటి నుంచి మోడల్ ప్రశ్నపత్రాల పంపిణీ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మోడల్ ప్రశ్నపత్రాల పంపిణీ

Published Thu, Oct 17 2013 3:21 AM

today  distribution for model paper

ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 3 నుంచి 10వ త రగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మోడల్ ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నట్లు లిటిల్ చాంప్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ గౌరవాధ్యక్షుడు భవనాసి సుబ్రహ్మణ్యం, డైరక్టర్ నాగలక్ష్మి బుధవారం తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఒలంపియాడ్‌లో పాల్గొనే విద్యార్థులకు మోడల్ ప్రశ్నపత్రాలు ఉచితంగా పంపిణీ చే స్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంతపేట పశువుల ఆస్పత్రి ఎదురుగా ఉన్న తమ సంస్థ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు పొందవచ్చని చెప్పారు. 2013కు గాను లిటిల్‌చాంప్ అకాడమీ అవార్డుల దరఖాస్తు గడువును నవంబరు 30వ తేదీ వరకు పొడిగించామన్నారు. రాష్ట్రస్థాయి ఒలంపియాడ్‌లో పాల్గొనే విద్యార్థుల వివరాలను సంబంధిత విద్యాసంస్థలు నవంబరు 10వ తేదీలోగా లిటిల్‌చాంప్స్ అకాడమీ, ఇంటి నం 58-7-41/1, సంతపేట, ఒంగోలు-1 చిరునామాకు పంపాలని కోరారు. వివ రాలకు 96183 43805ను సంప్రదించాలని సూచించారు. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement