నిలిచిన పొగాకు వేలం | tobaco selling temparorily suspended in maddipadu | Sakshi
Sakshi News home page

నిలిచిన పొగాకు వేలం

May 26 2015 10:50 AM | Updated on Sep 3 2017 2:44 AM

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం మరోసారి నిలిచిపోయింది.

ప్రకాశం: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం మరోసారి నిలిచిపోయింది. వ్యాపారస్థులు కొనుగోళ్లను నిలిపివేశారు. తాము తీసుకొచ్చిన పొగాకును బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంపై ముళ్లమూరు మండలం పోలవరం, బత్తూరివారిపాలెం క్లస్టర్‌కు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన పొగాకు బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేడుకు ఐదారు కేజీల వరకూ తరుగు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కంపెనీల గుమస్తాలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో పొగాకు బేళ్లను వేలం కేంద్రం వద్దే వదిలేసి వెళ్లిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement