breaking news
temparorily suspended
-
నిలిచిన పొగాకు వేలం
ప్రకాశం: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం మరోసారి నిలిచిపోయింది. వ్యాపారస్థులు కొనుగోళ్లను నిలిపివేశారు. తాము తీసుకొచ్చిన పొగాకును బయ్యర్లు కొనుగోలు చేయకపోవడంపై ముళ్లమూరు మండలం పోలవరం, బత్తూరివారిపాలెం క్లస్టర్‌కు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకొచ్చిన పొగాకు బేళ్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి మళ్లీ వేలం కేంద్రానికి తీసుకురావాలంటే ఒక్కో బేడుకు ఐదారు కేజీల వరకూ తరుగు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీల గుమస్తాలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆగ్రహంతో పొగాకు బేళ్లను వేలం కేంద్రం వద్దే వదిలేసి వెళ్లిపోయారు. -
మద్దిపాడులో నిలిచిన పొగాకు కొనుగోళ్లు
మద్దిపాడు (ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మద్దిపాడులోని పొగాకు రెండో వేలం కేంద్రం వద్ద గురువారం ఉదయం కొద్దిసేపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. సరైన ధర లభించకపోవటంతో గిట్టుబాటు కావటం లేదని రైతులు కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వేలం కేంద్రం సూపరింటెండెంట్ శ్రీనివాసులు నాయుడు జోక్యం చేసుకున్నారు. ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి, సరైన ధర చెల్లించాలని కోరారు. ఫలితంగా రైతులు ఆందోళన విరమించటంతో గంట తర్వాత కేంద్రంలో కొనుగోళ్లు మొదలయ్యాయి.