తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత | Tirupati Venkata member passes away | Sakshi
Sakshi News home page

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత

Dec 16 2014 1:08 AM | Updated on Aug 20 2018 2:31 PM

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత - Sakshi

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమ ణ (67) సోమవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
  • సాక్షి ప్రతినిధులు, తిరుపతి/చెన్నై/హైదరాబాద్: తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమ ణ (67) సోమవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయ న కొన్నేళ్లుగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.

    గత నెల 15న తిరుపతిలోని తన నివాసంలో స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యు లు స్విమ్స్‌కు తరలించారు. వారం తర్వాత కుదుటపడటంతో ఇంటికి చేరుకున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఈ నెల 8న చెన్నైలోని అపో లో ఆసుపత్రికి తరలించారు.

    మరుసటి రోజు ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడి వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఊపిరి తిత్తుల ఇన్‌ఫెక్షన్ సోకడం, చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో సోమవారం ఉదయం 10 గంటలకు కన్నుమూశారు. వెంకటరమణ భౌతికకాయాన్ని చెన్నై నుంచి తిరుపతిలోని స్వగృహానికి తరలించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యేకు భార్య సుగుణ, కుమార్తెలు సుమ, హరిత ఉ న్నారు.
     
    రాజకీయాల్లో మాస్ లీడర్‌గా..

    వెంకటరమణ 1947 మార్చి 1న తిరుపతిలో హనుమంతయ్య, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివారు. ఆ తర్వాత  వ్యాపారం చేస్తూనే, నాటక రంగంలోకి ప్రవేశించారు. చిత్ర దర్శకుడు దాసరి సహ కారంతో, సినీ రంగంలోనూ మెరిశారు.1974లో కాంగ్రెస్ పార్టీలో చేరి, మాస్ లీడర్‌గా ఎదిగారు. 2004 ఎన్నికల్లో తిరుపతి నుంచి అసెంబ్లీకి  ఎన్నికయ్యారు. 2009లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు.  ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేసి  మళ్లీ గెలిచారు.
     
    గవర్నర్, స్పీకర్ సంతాపం

    వెంకట రమణ మృతికి రాష్ట్ర గవర్నర్ నరసిం హన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్పీకర్ కోడెల కూడా నివాళు లర్పించారు.
     
    సీఎం నివాళులు:
    వెంకటరమణ మృతి విషయం తెలిసిన తిరుపతి వచ్చిన సీఎం చంద్రబాబు  ఎమ్మెల్యే పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
     
    జగన్ సంతాపం: తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపాన్ని వ్యక్తంచేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement