నేడు జననేత పర్యటన ఇలా.. | tirupathi tour in ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నేడు జననేత పర్యటన ఇలా..

Jan 26 2014 3:41 AM | Updated on Jul 25 2018 4:09 PM

నేడు జననేత  పర్యటన ఇలా.. - Sakshi

నేడు జననేత పర్యటన ఇలా..

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడవరోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగుతుందని.....

 సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏడవరోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో సాగుతుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు.
     
 ఆదివారం ఉదయం విజయపురం మండలం సూరికాపురం నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది.
     
 నిండ్ర మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
 మాధవరంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
 ఆళ్లపాకం క్రాస్, కమ్మకండ్రిగ క్రాస్, 9వ మైలు, నిండ్ర, షుగర్ ఫ్యాక్టరీ మీదుగా రోడ్‌షో కొప్పేడుకు చేరుకుంటుంది.
     
 కొప్పేడులో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
 సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీర్లపూ డిలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
 పిచ్చాటూరులో బహిరంగ సభ
     
 అప్పంబట్టు, రామగిరి, కృష్ణాపురంల్లో రోడ్‌షో
     
 నాగలాపురంలో మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
     
 వడలకుప్పం, వెల్లూరులో రోడ్ షో ఎస్‌ఎస్ పురంలో ఓదార్పు.
     
 ఓబులరాజుల కండ్రిగలో పార్టీ జిల్లా కార్మికవర్గ విభాగం కన్వీనర్ బీరేంద్ర ఇంట్లో బస చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement