అంగరంగవైభవంగా కొనసాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఆదివారం శ్రీవారికి గరుడ సేవ జరుగనుంది.
తిరుమల : అంగరంగవైభవంగా కొనసాగుతున్న తిరుమల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగనున్నారు. ఆదివారం రాత్రికి విశేష ఆభరణ భూషితుడై కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు గరుడ సేవ కొనసాగే అవకాశం ఉంది. లక్షమందికిపైగా భక్తులు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. కాగా ఆదివారం ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిషేధించారు.
ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. కాగా గరుడ సేవ సందర్భంగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.