ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లకు ప్రమోషన్‌

Three IPS Officers Are Promoted TO DGP Rank In AP - Sakshi

అమరావతి: ఏపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు ప్రమోషన్‌ కల్పించింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేస్తోన్న ఏబీ వెంకటేశ్వరరావు, రైల్వేస్‌(ఏపీ) చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేఆర్‌ఎం కిషోర్‌ కుమార్‌, విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమల రావులకు డీజీపీ స్థాయి హోదాను కల్పించింది. ప్రమోషన్‌ వచ్చిన ఈ ముగ్గురు ఐపీఎస్‌లు కూడా 1989 బ్యాచ్‌కు చెందినవారే. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ హోదాలో వీరికి రూ.205400 నుంచి 224400 మధ్య వేతనం లభిస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top