సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం | Thopudurthi PrakashReddy fires on Paritala Sriram | Sakshi
Sakshi News home page

సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం

Published Fri, Dec 28 2018 4:09 PM | Last Updated on Fri, Dec 28 2018 6:31 PM

Thopudurthi PrakashReddy fires on Paritala Sriram - Sakshi

మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తారా అంటూ  సాక్షి కార్యాలయం ఎదుట మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వీరంగం

సాక్షి, అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వీరంగం సృష్టించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురం కమలానగర్లోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్.. సాక్షి మీడియా పై తన అక్కసు వెళ్లగక్కారు.

సాక్షి కార్యాలయం వద్ద మంత్రి పరిటాల సునీత వర్గీయుల ధర్నాను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.


వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement