నేడు శ్రీవారి దర్శనం నిలిపివేత | There Will Be No TTD Srivari Darshan on June 21st | Sakshi
Sakshi News home page

నేడు శ్రీవారి దర్శనం నిలిపివేత

Jun 21 2020 4:33 AM | Updated on Jun 21 2020 4:33 AM

There Will Be No TTD Srivari Darshan on June 21st - Sakshi

మూసివేసిన శ్రీవారి ఆలయం

తిరుమల: సూర్యగ్రహణం కారణంగా ఆదివారం (నేడు) తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ భక్తులను కోరుతోంది. కాగా, ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement