రెండు పంటలకు ఢోకా లేనట్లే!

There is no dhoka for next two crops - Sakshi

భారీగా వరదతో పెరుగుతున్న సాగర్‌ మట్టం 

సాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసిన జగదీశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ 

నాగార్జునసాగర్‌: కృష్ణా, గోదావరి బేసిన్లు కొత్తనీటితో కళకళ్లాడుతున్నాయి. రెండు రాష్ట్రాల రైతులకు.. రెండు పంటలకు సరిపోయేంతనీరు జలాశయాల్లోకి చేరుతోందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు ఆంధ్రప్రదేశ్‌ భారీనీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు సారెచీరలతోపాటు పూలమాలలు, పసుపు కుంకుమతో వాయినమిచ్చారు. సీఎం కేసీఆర్‌ కృష్ణా, గోదావరి నదుల్లోని ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాలతో స్నేహపూర్వకంగా మెలిగి అభివృద్ధి చెందడం ఎలాగో సీఎం కేసీఆర్‌ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉంటూ.. సహజవనరులను సద్వినియోగం చేసుకుని ఇరురాష్ట్రాల రైతాంగాని కి లబి్ధచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నా రు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లిద్దరు.. కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. 

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు కూడా.. 
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపు రం సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రధాన గేటు నుంచి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం పూల్యాతండా సమీపంలోని పంప్‌హౌజ్‌ ద్వారా ఏఎమ్మార్పీ లో–లెవల్‌ వరద కాల్వకు 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో బండా నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నర్సింహయ్య, భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

సాగర్‌కు భారీగా పెరిగిన వరద 
నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాగర్‌ రిజర్వాయర్‌లో గంటకో అడుగు చొప్పున నీటిమట్టం పెరుగుతుండటంతో సోమవారం గేట్లు ఎత్తనున్నట్లు తెలిసింది. తెలం గాణ, ఏపీ మంత్రులు నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు సమాచారం. 

లక్ష్మి బ్యారేజీలో 65 గేట్ల ఎత్తివేత 
కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఆదివారం నిలకడగా 9.39 మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీలో 65 గేట్లు ఎత్తిగా దిగువకు 3.26 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top