యువ రైతు ఆత్మహత్య | The young farmer commits suicide | Sakshi
Sakshi News home page

యువ రైతు ఆత్మహత్య

Jan 27 2016 7:25 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ తాళలేక యువరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తాళలేక యువరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో బుధవారం సాంయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాజహాన్(24) తండ్రితో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు తల్లి దండ్రులు పొలం వద్దకు వెళ్లాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం ఇంటి కి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు ఇది గుర్తించి అప్పుల బాధ తాళలేక తమ కొడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement