రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం | The start of the state badminton competitions | Sakshi
Sakshi News home page

రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

Oct 30 2014 4:46 AM | Updated on Sep 2 2017 3:34 PM

రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

రాష్ట్ర బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో 60వ పాఠశాలల క్రీడా(స్కూల్ గేమ్స్) పోటీలు ప్రారంభమయ్యూయి.

శ్రీకాకుళం స్పోర్ట్స్: శ్రీకాకుళం పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో 60వ పాఠశాలల క్రీడా(స్కూల్ గేమ్స్) పోటీలు ప్రారంభమయ్యూరుు. మూడు రోజుల పాటు జరగనున్న షటిల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు చదువులో భాగమేనన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఎల్లప్పుడూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంవీ పద్మావతి, డీఈఓ అరుణకుమారి, డీఎస్‌డీఓ జూన్ గెల్యూట్, ప్రభుత్వ డిగ్రీకళాశాల(పురుషులు) ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు పోటీల్లో కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల క్రీడాకారులు ముందంజలో ఉన్నారు. మరోవైపు రాష్ట్ర స్కూల్‌గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు గురు, శుక్రవారాల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement