తప్పుడు చిరునామాలతో సిమ్ కార్డులు విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లు
సత్తెనపల్లి : తప్పుడు చిరునామాతో సత్తెనపల్లిలో సిమ్ కార్డులు విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టణంలో విజయ్ అనే ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు సిమ్‌లను తీసుకొచ్చి తప్పుడు చిరునామాలతో అమ్మకాలు చేపడుతున్నారు. ఓ డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి అర్బన్ సీఐ ఎస్.సాంబశివరావు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రత్యేకంగా ఓ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్, ఆధార్, రేషన్ కార్డుల్లోని ఫొటోలను మార్చేసి, అదే చిరునామాలతో సిమ్‌లను విక్రయిస్తున్నారు.
ప్రధాన డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక్కొక్కరు 350 సిమ్‌లు తీసుకుని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వీటిలో మొత్తం సిమ్‌లను విక్రయిస్తే ఒక్కో సిమ్‌కు రూ.10 చొప్పున, 350 సిమ్‌లకు రూ.3,500 కమీషన్ రూపేణా వస్తుంది. సబ్ డిస్ట్రిబ్యూటర్ కేవలం 349 సిమ్‌లు మాత్రమే విక్రయాలు జరిపితే అన్ని సిమ్‌లకు కమిషన్ నిలిచి పోతుంది. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయగా మిగిలిన సిమ్‌లను తప్పుడు అడ్రస్సులతో యాక్టివేట్ చేసి విక్రయాలు జరిపినట్లు చూపుతున్నారు. చిరునామా లేని సిమ్‌లను విద్యార్థులు, యువకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
ప్రధానంగా పట్టణంలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని ఐదుగురు సబ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యేకంగా ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడ ఈ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురు డిస్ట్రిబ్యూటర్లతో పాటు వారి నుంచి 4,300 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని, పూర్తి స్థాయిలో వారి నుంచి యంత్రాలు, సిమ్ కార్డులు స్వాధీనపరుచుకోవాల్సి ఉందని సీఐ సాంబశివరావు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు పోలీసుల అదుపులో ఉండటంతో రిటైల్ వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరిని ఎప్పుడు పోలీసులు రమ్మంటారోనని భయాందోళన చెందుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ రాకెట్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి వారి అక్రమ విక్రయాలకు ఫుల్స్టాప్ పెడతామని సీఐ చెప్పారు.
సత్తెనపల్లిలో ‘సిమ్’ల రాకెట్
Published Sun, Aug 30 2015 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement