విభజనతో నష్టపోయింది వైద్య విభాగమే | The medical division dropped by division | Sakshi
Sakshi News home page

విభజనతో నష్టపోయింది వైద్య విభాగమే

Aug 31 2015 1:01 AM | Updated on Oct 9 2018 7:11 PM

విభజనతో నష్టపోయింది వైద్య విభాగమే - Sakshi

విభజనతో నష్టపోయింది వైద్య విభాగమే

రాష్ట్ర విభజనలో భారీగా నష్టపోయింది వైద్యవిభాగమే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
 
 గుడివాడ టౌన్ : రాష్ట్ర విభజనలో భారీగా నష్టపోయింది వైద్యవిభాగమే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం కృృష్ణాజిల్లా గుడివాడలోని ఐఎంఏ హాలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కృృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల రీజినల్ కౌన్సిల్ సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. కామినే ని మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. గతంలో ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకం పర్యవేక్షణ లోపం వలన లబ్ధిదారులకు చేరుకోలేదని, అందుకే దానిలో మార్పులు తెచ్చామన్నారు.

 500 మంది వైద్యుల నియామకం
 ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు త్వరలోనే 500 మంది వైద్యులను నియమిస్తున్నామన్నారు. ప్రతి ఏరియా ఆస్పత్రిలో  గైనకాలజిస్ట్, ఎనస్తీషియన్, సర్జన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 ఎలుకల దాడి దురద ృష్టకరం..
 తప్పు ఎవరు చేసినా తలవంపులు వైద్యశాఖదే అని మంత్రి కామినేని అన్నారు. గుంటూరులో ఎలుకల దాడిలో పసికందు వృతిచెందిన విషయాన్ని తీవ్రంగా ఖండించడమే కాక శాశ్వత పరిష్కారానికి మార్గం కనుగొంటున్నామని చెప్పారు. ఒకరినో, ఇద్దరినో బలిచేయడం వలన సమస్య పరిష్కారం కాదని, ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు.   ఇప్పటికే అన్ని సేవలను ఆన్‌లైన్ చేశామని తద్వారా లంచగొండితనాన్ని రూపుమాపవచ్చని పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులకు ట్యాబ్‌లు అందజేశామని వాటి ద్వారా తల్లీపిల్లల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తూ వారికి మెరుగైన సేవలందిస్తారని తెలిపారు.

ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ల రెన్యువల్స్‌కు సంబంధించి ఫైర్ ఆఫీసర్ల ఎన్‌ఓసీల విధానంలో మార్పులు తెచ్చేందుకు రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రహ్మాన్,  ఐఎంఏ గుడివాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, అధ్యక్ష, కార్యదర్శులు భవానీశంకర్, మాగంటి శ్రీనివాస్, డి.ఆర్.కె.ప్రసాద్, వంశీక ృష్ణ, సి.ఆర్.ప్రసాదరావు, బి.సుబ్బారావు, అశోక్, సోమూరి వెంకట్రావు, వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 400 మంది వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement