దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం | the key role of ladies in country development | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

Mar 8 2014 2:20 AM | Updated on Mar 3 2020 7:07 PM

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.మాధవీ కృష్ణ అన్నారు.

 ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్ : దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి డి.మాధవీ కృష్ణ అన్నారు. అంతార్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య, ఉద్యోగ రంగాల్లో పురుషులకు సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. మహిళలకు ప్రతిభకు తగ్గట్టుగా గౌరవం పెరగాలన్నారు.

స్పెషల్ మొబైల్ మెజిస్ట్రేట్ పి.అరుణకుమారి మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నారు. స్వతంత్య్రం వచ్చి 67 ఏళ్లు దాటినా దేశంలో మహిళలకు రక్షణ కరువైందని న్యాయవాది వనం కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి నరసింహారావు, ఉపాధ్యక్షుడు కూర్మాచలం రవీంద్రస్వామి, జనరల్ సెక్రటరీ గండికోట సీతారామశర్మ, న్యాయవాదులు అమ్ములు జైన్, పి.సంధ్యారాణి, పొలిశెట్టి పద్మావతి, జాలావతి, పసుమర్తి లలిత, ఎన్.వి.వి.పద్మావతి, స్వర్ణకుమారి, ఇందిర పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాధవీకృష్ణ, అరుణ కుమారిని మహిళా న్యాయవాదులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement