రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ 25, డ్రైవర్ 134 పోస్టులకు మార్చి 19వ తేదీన తుది రాతపరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ మెకానికల్ 25, డ్రైవర్ 134 పోస్టులకు మార్చి 19వ తేదీన తుది రాతపరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ పోస్టులకు నిర్వహించిన డ్రైవింగ్, ట్రేడ్ పరీక్షల్లో 6,922 మంది అర్హత సాధించారని వెల్లడించారు.
వీరికి కాకినాడలో మార్చి 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. కాగా మార్చి 9వ తేదీ నుంచి అభ్యర్థుల హాల్‌టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.