ఏదైతే కాకూడదనుకున్నామో అదే అయ్యింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రెప్పపాటులో రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పెద్దలు ఘనంగా చాటుకున్నారు.
ఏదైతే కాకూడదనుకున్నామో అదే అయ్యింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రెప్పపాటులో రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పెద్దలు ఘనంగా చాటుకున్నారు. ఎన్నడూ.. ఎక్కడా చట్టసభలో ఇలా బిల్లు ప్రవేశపెట్టలేదు. కనీవినీ ఎరుగని రీతిలో గురువారం ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సమైక్యవాదులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. టీడీపీ, కాంగ్రెస్ నేతల దొంగాట నడుమ సీమాంధ్రకు ద్రోహం జరిగిపోయింది.
చేయాల్సిందంతా చేసి.. అన్ని పనులు పూర్తి చేసుకుని.. తుదకు రాజ్యసభ ఎన్నికలు కూడా కోరుకున్నట్లు జరిపించుకుని ఏమీ తెలియనట్లు నటిస్తున్న కపట నాటక సూత్రధారులైన కాంగ్రెస్ నేతలపై జనం రగిలిపోతున్నారు. వారి నాటకాన్ని ముందుండి నడిపించిన టీడీపీ నేతల రాజకీయ జీవితానికి చరమగీతం పాడతామంటున్నారు.