ఏపీ టెన్త్‌ ఫలితాలు నేడే.. | Tenth exam results is today | Sakshi
Sakshi News home page

ఏపీ టెన్త్‌ ఫలితాలు నేడే..

Apr 29 2018 3:14 AM | Updated on Aug 18 2018 5:57 PM

Tenth exam results is today - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌ హాలులో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.

తొలుత ఏయూలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని భావించినా, ఆ సమయానికి విద్యాశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు చేరుకోలేరన్న ఉద్దేశంతో సాయంత్రానికి మార్చినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారులు ఫలితాలకు విడుదలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. www.sakshi.com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో ఫలితాలను చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement