టీడీపీ నేత నివాసంలో నకిలీ మద్యం స్వాధీనం


రంగారెడ్డి జిల్లాలోని దెబ్బడిగల్లో తెలుగుదేశంపార్టీ నేత రవీందర్ నివాసంపై గురువారం తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో రూ. 5 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు ఆయన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయన్ని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. నకిలీ మద్యం ఎక్కడి నుంచి తెస్తున్నారు.  ఎన్నాళ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు అనే అంశాలపై పోలీసులు రవీందర్ను తమదైన శైలీలో ప్రశ్నిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top