ఆ టైటిల్‌ గెలిచిన వారిలో తెలుగు కుర్రాడు | Telugu Boy Who Won the International Title | Sakshi
Sakshi News home page

ఇంటర్నేషనల్‌ టైటిల్‌ గెలిచిన తెలుగు కుర్రాడు

Aug 4 2019 7:12 PM | Updated on Aug 4 2019 7:55 PM

Telugu Boy Who Won the International Title - Sakshi

సాయి సాత్విక్‌ (ఫైల్‌)

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించిన జోడీలో ఒకరైన సాయి సాత్విక్‌ మన తెలుగువాడే. అతని పూర్తి పేరు రాంకిరెడ్డి సాయి సాత్విక్‌.  2000, ఆగస్టు 13వ తేదీన అమలాపురంలో జన్మించాడు. 2016 నుంచి చిరాగ్‌ శెట్టితో జోడీగా ఆడుతున్న సాయి సాత్విక్‌  అప్పటి నుంచి 6 ఇంటర్నేషనల్‌ టోర్నీలను గెలుచుకున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత టోర్నీలో అన్‌సీడ్‌గా బరిలోకి దిగిన వీరు ప్రపంచ ఛాంపియన్లయిన లీ జున్‌ హూ- యు చెన్‌ను ఓడించడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చైనా షట్లర్లును 21-19, 18-21, 21-18 తేడాతో ఓడించారు. దీంతో కొత్త చరిత్ర సృష్టించిన వీరి జోడికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాత్విక్‌ ప్రదర్శన పట్ల జిల్లా వాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement