breaking news
doubles winner
-
ఆ టైటిల్ గెలిచిన వారిలో తెలుగు కుర్రాడు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : థాయ్‌లాండ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన జోడీలో ఒకరైన సాయి సాత్విక్ మన తెలుగువాడే. అతని పూర్తి పేరు రాంకిరెడ్డి సాయి సాత్విక్. 2000, ఆగస్టు 13వ తేదీన అమలాపురంలో జన్మించాడు. 2016 నుంచి చిరాగ్ శెట్టితో జోడీగా ఆడుతున్న సాయి సాత్విక్ అప్పటి నుంచి 6 ఇంటర్నేషనల్ టోర్నీలను గెలుచుకున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత టోర్నీలో అన్సీడ్గా బరిలోకి దిగిన వీరు ప్రపంచ ఛాంపియన్లయిన లీ జున్ హూ- యు చెన్ను ఓడించడం విశేషం. హోరాహోరీగా సాగిన ఫైనల్లో చైనా షట్లర్లును 21-19, 18-21, 21-18 తేడాతో ఓడించారు. దీంతో కొత్త చరిత్ర సృష్టించిన వీరి జోడికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సాత్విక్ ప్రదర్శన పట్ల జిల్లా వాసులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
డబుల్స్ విజేత వైష్ణవి-అర్చన జంట
సింగిల్స్‌లో సాయమ్, వైష్ణవిలకు రన్నరప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఏపీ రాష్ట్రాల జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బాలికల డబుల్స్ టైటిల్‌ను టాప్ సీడ్ వైష్ణవి-అర్చన (రంగారెడ్డి) జోడీ కైవసం చేసుకుంది. బాలుర సింగిల్స్‌లో సాయమ్ బోత్రా, బాలికల సింగిల్స్‌లో వైష్ణవి రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. విశాఖపట్టణంలోని పోర్ట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలతో ఈ ఈవెంట్ ముగిసింది. అండర్-17 బాలికల డబుల్స్ తుదిపోరులో టాప్‌సీడ్ కె.వైష్ణవి-బి.అర్చన జంట 22-20, 21-14తో రాష్ట్రానికే చెందిన రెండో సీడ్ శ్రీచందన (మెదక్)-ప్రణాలి కరణి (హైదరాబాద్) జంటపై గెలుపొందింది. దీంతో ప్రణాలి జోడీ రన్నరప్‌గా నిలిచింది. బాలికల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ వైష్ణవి (రంగారెడ్డి) 16-21, 12-21తో రెండో సీడ్ ఎం.తనిష్క్ (గుంటూరు) చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో వైష్ణవి 21-18, 21-16తో హేమధ్రుతి (వైజాగ్)పై, తనిష్క్ 21-13, 21-8తో శ్రీచందన (మెదక్)పై నెగ్గారు. బాలుర సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ సాయమ్ బోత్రా (హైదరాబాద్) 22-20, 16-21, 12-21తో టాప్ సీడ్ జగదీశ్ (వైజాగ్) చేతిలో కంగుతిన్నాడు. సెమీస్‌లో సాయమ్ 21-17, 20-22, 21-17తో రెండో సీడ్ ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై, జగదీశ్ 15-21, 21-17, 21-16తో చంద్రకుమార్ (తూర్పు గోదావరి)పై గెలుపొందారు. బాలుర డబుల్స్ ట్రోఫీని అంజన్ సాయి (పశ్చిమ గోదావరి)-ఎస్.కె.గౌస్ (నెల్లూరు) జోడీ గెలుచుకుంది.