ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు | telangana employees locked apngo office | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు

Nov 20 2014 1:28 PM | Updated on Sep 6 2018 3:01 PM

హైదరాబాద్ గన్పౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు గురువారం తాళం వేశారు.

హైదరాబాద్ : హైదరాబాద్ గన్పౌండ్రీలోని  ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు గురువారం తాళం వేశారు.  తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామంటే... అశోక్ బాబు వినటం లేదంటూ తెలంగాణ ఉద్యోగులు  ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్‌జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు గతంలో వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement