పోలీస్ బాస్లు.. తెలంగాణకు అనురాగ్ శర్మ, ఏపీకి జేవీ రాముడు | Telangana, Andhrapradesh DGPs appointed | Sakshi
Sakshi News home page

పోలీస్ బాస్లు.. తెలంగాణకు అనురాగ్ శర్మ, ఏపీకి జేవీ రాముడు

Jun 1 2014 6:45 PM | Updated on Jun 2 2018 2:56 PM

తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త డీజీపీల నియామకానికి ఆమోద ముద్ర పడింది. తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా జేవీ రాముడు నియమితులయ్యారు. రెండు రాష్ట్రాలకు కేటాంయిన ఐపీఎస్ అధికారుల్లో సీనియర్లయిన వీరి పేర్లను ఇంతకుముందు గవర్నర్ నరసింహన్కు ప్రతిపాదించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు కాబోయే ముఖ్యమంత్రులు చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడు గవర్నర్ను కలసి అనురాగ్ శర్మ, జేవీ రాముడులను నియమించాల్సిందిగా కోరారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారం కేసీఆర్, ఈ నెల 8న చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement