ఎన్నికల అనంతరం ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్‌లకు పోస్టింగ్‌లను ఖరారు చేస్తూ కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం రాత్రి జాబితా విడుదల చేశారు.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల అనంతరం ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్‌లకు పోస్టింగ్‌లను ఖరారు చేస్తూ కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం రాత్రి జాబితా విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడేళ్లు ఒకే చోట పనిచేసిన తహశీల్దార్లకు స్థానచలనం జరిగిన సంగతి తెల్సిందే! అయితే ఎన్నికల తంతు ముగియడంతో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన తహశీల్దార్‌లు మళ్లీ వెనక్కి వచ్చారు. వారికి పోస్టింగ్‌లు కల్పించే క్రమంలో గతంలో పని చేసిన వారి పాత స్థానాల్లో మార్పులు జరిగాయి.
ఏడుగురికి మాత్రమే పాత స్థానాలు
జిల్లాలోని ఏడుగురు తహశీల్దార్‌లను వారి పాత స్థానాలకు కేటాయించారు. పరిపాలనా విభాగంలో ఉన్న అంశాల ప్రాతిపదికన వీరిని ఇతర చోట్ల నియమించలేదు. పూసపాటి రేగ తహశీల్దార్ వి పద్మావతి, కొత్తవలస తహశీల్దార్ బీటీవీ రామారావు బలిజిపేట తహశీల్దార్ జె.ఈశ్వరమ్మలతో పాటు కలెక్టరేట్ ఏఓ పీ సీహెచ్ వి రమణమూర్తి, కలెక్టరేట్‌లోని ‘ఇ’ సెక్షన్‌సూపరింటెండెంట్ జి అప్పలనరసయ్య, కేఆర్సీ స్పెషల్ తహశీల్దార్ బీవీ. రమణమూర్తి, ఆర్డీఓ విజయనగరం కార్యాలయంలోని ఏఓ పి.కాశీవిశ్వనాథంలను యథాస్థానాల్లో ఉంచారు.