breaking news
Postings Finalizing
-
‘పవర్’ఫుల్ పోస్టులే కావాలి
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. తాను బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలం నుంచే అంతర్గత బదిలీల చర్యలు చేపట్టారు. వాటివల్ల ప్రయోజనం కలుగుతుందని ఆయన భావించినప్పటికీ సత్ఫలితాలు కనిపించడం లేదు. స్వల్ప కాలంలోనే తరచూ బదిలీలతో కొందరు.. ఉన్నత స్థానాల్లోంచి వాటికంటే తక్కువ అధికారం ఉన్న స్థానాల్లో నియమించారని కొందరు.. అసలు పనులే చేయడం లేదు. తమ స్థాయికి తగిన పోస్టులివ్వలేదని కొందరు డ్యూటీలకు రావడమే మానేశారు.ఆ మాటకొస్తే.. కర్ణన్‌ను కమిషనర్‌గా నియమించాక జీహెచ్ఎంసీలో ఆయన కంటే సీనియర్ అయిన ఐఏఎస్ అధికారి ఒకరు జీహెచ్ఎంసీకే రాలేదు. దాంతో ప్రభుత్వం ఆయనను రాష్ట్రస్థాయి పోస్టుకు బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, సర్కిళ్ల పరిధుల్లో డిప్యూటీ కమిషనర్లుగా ఉన్న వారిని ఆ స్థాయి కంటే తక్కువ స్థాయివిగా భావించే జాయింట్ కమిషనర్లుగా నియమించడంతో కొందరు అసలు విధులకే రాకుండా మానేశారు. కొందరు తప్పదన్నట్లు సదరు పోస్టుల్లో చేరినా అసలు పనులు మాని, తాము కోరుకున్న పోస్టుల కోసం సచివాలయం చుట్టూ, మంత్రుల చుట్టూ, ఇతరత్రా రాజకీయనేతల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో పని ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఓ విభాగంలో ముగ్గురు జాయింట్ కమిషనర్లను నియమిస్తే.. ఇద్దరు తమకు ఇచ్చిన పనులు మాని పైరవీల వేటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి తక్కువ.. కొందరికి ఎక్కువమరోవైపు కొందరు ఉన్నతాధికారులకు మాత్రం అదనపు భారం పడుతోంది. వాస్తవానికి జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జీహెచ్ఎంసీ స్థాయిలో కమిషనర్ కంటే కూడా జోనల్ స్థాయిలో వారికే ఎక్కువ పనులుంటాయి. అలాంటిది కొందరు జోనల్ కమిషనర్లకే ఇతరత్రా విభాగాల అదనపు బాధ్యతలు కూడా అప్పగించడంతో వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. బాగా పని చేస్తారని బరువంతా వారిపైనే మోపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక జోనల్ కమిషనర్.. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కీలక స్థానంలో ఉన్నారు. మరో జోనల్ కమిషనర్‌కు కీలకమైన జోనల్ బాధ్యతలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ కీలకమైన ఐటీ, రెవెన్యూ విభాగాల బాధ్యతలున్నాయి. అధిక నిర్మాణాలతో పాటు అధిక పనులుండే మరో జోనల్ కమిషనర్‌కు ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విభాగం బాధ్యతలప్పగించారు. వారందరూ ప్రతిరోజూ రెండు పోస్టుల నిర్వహణకు గాను దూరంగా ఉన్నప్పటికీ రెండు కార్యాలయాలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇదే తరుణంలో ప్రధాన కార్యాలయంలోని కొందరు అడిషనల్ కమిషనర్లకు మాత్రం పేరుకు మాత్రం రెండేసి విభాగాలున్నప్పటికీ, వాటిల్లో చేసేందుకు పెద్దగా పనేమీ ఉండదు. అయినప్పటికీ, విద్యుత్ విభాగానికి మాత్రం అడిషనల్ కమిషనర్ లేరు. నగరంలో అత్యంత సమస్యాత్మక అంశాల్లో వీధిదీపాల సమస్య ప్రధానమైనది. అయినప్పటికీ, వీధిదీపాలను పర్యవేక్షించేందుకు విద్యుత్ విభాగానికి అడిషనల్ కమిషరే లేదు. చేసేవారికి అదనపు భారం. చేయని వారికి నామమాత్రం. ఇంకొందరు ఎక్కడుంటారో, ఏంచేస్తారో తెలియదు. పోస్టు మాత్రం జీహెచ్ఎంసీలో ఉంటుంది. ఇదీ జీహెచ్ఎంసీ తీరు. -
తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఖరారు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల అనంతరం ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లను ఖరారు చేస్తూ కలెక్టర్ కాంతిలాల్ దండే మంగళవారం రాత్రి జాబితా విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడేళ్లు ఒకే చోట పనిచేసిన తహశీల్దార్లకు స్థానచలనం జరిగిన సంగతి తెల్సిందే! అయితే ఎన్నికల తంతు ముగియడంతో జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన తహశీల్దార్లు మళ్లీ వెనక్కి వచ్చారు. వారికి పోస్టింగ్‌లు కల్పించే క్రమంలో గతంలో పని చేసిన వారి పాత స్థానాల్లో మార్పులు జరిగాయి. ఏడుగురికి మాత్రమే పాత స్థానాలు జిల్లాలోని ఏడుగురు తహశీల్దార్లను వారి పాత స్థానాలకు కేటాయించారు. పరిపాలనా విభాగంలో ఉన్న అంశాల ప్రాతిపదికన వీరిని ఇతర చోట్ల నియమించలేదు. పూసపాటి రేగ తహశీల్దార్ వి పద్మావతి, కొత్తవలస తహశీల్దార్ బీటీవీ రామారావు బలిజిపేట తహశీల్దార్ జె.ఈశ్వరమ్మలతో పాటు కలెక్టరేట్ ఏఓ పీ సీహెచ్ వి రమణమూర్తి, కలెక్టరేట్లోని ‘ఇ’ సెక్షన్సూపరింటెండెంట్ జి అప్పలనరసయ్య, కేఆర్సీ స్పెషల్ తహశీల్దార్ బీవీ. రమణమూర్తి, ఆర్డీఓ విజయనగరం కార్యాలయంలోని ఏఓ పి.కాశీవిశ్వనాథంలను యథాస్థానాల్లో ఉంచారు.