ఎన్టీపీసీ రెండవ యూనిట్‌లో సాంకేతిక లోపం

Technical Issues Arising In Simhadri Super Thermal Power Project - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ)లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మంగళవార ప్రాజెక్టులోని రెండవ యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుతం సింహాద్రిలో మూడవ యూనిట్‌ నుంచి మాత్రమే 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. కాగా సింహాద్రిలో ఇప్పటికే ఒకటో యూనిట్‌, నాలుగో యూనిట్‌లలో సాంకేతిక కారణాలతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోగా.. నేడు మరో యూనిట్‌లో సాంకేతిక లోపంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీని పునరుద్దరణకు సాంకేతిక సిబ్బంది మరమ్మత్తులు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top