చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు.