► ఇసుక రీచ్ నుంచి వెళ్లిపోతాం
► పెనుమాక క్వారీలో అధికారుల ఆవేదన
తాడేపల్లి రూరల్: ‘సార్! అనుమతులు చూపించండి.. ఇసుక రీచ్‌లో నుంచి మేము వెళ్లిపోతాం.. మిమ్ముల్ని సతాయించాలని మేము ఇక్కడకు రాలేదు’ ఓ అధికారి బుధవారం పెనుమాక రీచ్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడితో ఫోన్లో సంభాషించిన తీరు ఇదీ. సేకరించిన సమాచారం మేరకు.. పెనుమాక ఇసుక రీచ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులకు, టీడీపీ తాడేపల్లి మండల నాయకులకు మధ్య ఇసుక అమ్ముకునే విషయంపై గత రెండు రోజుల నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు చేతులెత్తేసి, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా నుంచి రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రత్యేక గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ సత్యసాయి క్వారీలో జరుగుతున్న ఆధిపత్య పోరును సద్దుమణిగించేందుకు పెనుమాక ఇసుక రీచ్‌కి బుధవారం వచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు తమ దగ్గర ఉన్న పత్రాలను సత్యసాయికి చూపించారు. అలాగే రెండో వర్గానికి చెందిన ఎమ్మెల్యే అనుచరులను కూడా పత్రాలు చూపించమని కోరడంతో వారు పత్రాలు చూపించకుండా, మా సార్ మాట్లాడతారు, మీరు ఫోన్లో మాట్లాడమంటూ డిప్యూటి కలెక్టర్‌కు ఫోన్ అందజేశారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి గుంటూరుకు వస్తే పత్రాలు చూపిస్తానని తెలియజేశారు. అధికారి మాత్రం రెండు గంటలైనా ఇక్కడే ఉంటాను.. మీరు పంపించండంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఎమ్మెల్యే అనుచరులు పలుసార్లు అధికారిని బెదిరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
చివరకు సత్యసాయి ఇరిగేషన్ ఎస్ఈని ఫోన్లో సంప్రదించగా.. అనుమతులు ఇవ్వలేదనీ, ఇసుక తీసుకోమని జిల్లా కలెక్టర్ చెప్పారని సెలవిచ్చారు. దీంతో అసహనం చెందిన డిప్యూటి కలెక్టర్ సత్యసాయి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. జరుగుతున్న ఈ తంతు చూస్తుంటే ఎటువంటి అనుమతులు లేకుండానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం అవుతోందని అక్కడకు వచ్చిన పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.
సార్.. అనుమతులు చూపించండి!
Published Thu, Mar 31 2016 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సీఎం జగన్ వెంటే ఉంటాం ●
నగేష్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
నయ వంచకుడు చంద్రబాబు
No Headline
జేసీకి భంగపాటు తప్పదు
పల్లె పిలిచింది
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement