ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ | TDP MLA Erra shekar accused in Brother murder case surrender | Sakshi
Sakshi News home page

ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్యే ఎర్ర శేఖర్

Aug 26 2013 1:42 PM | Updated on Aug 10 2018 7:19 PM

సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే (ఏ.చంద్రశేఖర్) ఎర్ర శేఖర్ సోమవారం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు.

జడ్చర్ల : సోదరుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ జడ్చర్ల  ఎమ్మెల్యే (ఏ.చంద్రశేఖర్) ఎర్ర శేఖర్ సోమవారం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆయన గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. సోదరుడి హత్య కేసులో ఎర్రశేఖర్ ప్రధాన నిందితుడు. ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్(41) దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో  జూలై17న హత్యకు గురైన సంగతి తెలిసిందే.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  తన భర్తను ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ఎర్ర శేఖరే హత్య చేయించారని జగన్మోహన్ భార్య ఆశ్రిత అప్పట్లో ఆరోపించారు. కాగా కొద్దిరోజుల క్రితం ఎర్ర శేఖర్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.  దాంతో ఆయన ఈరోజు ఉదయం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement