పక్కా పథకం ప్రకారమే పిన్నెల్లిపై హత్యాయత్నం | TDP Leaders Only Attack On Pinneli Rajakrishna Reddy Sasy RK Roja | Sakshi
Sakshi News home page

పక్కా పథకం ప్రకారమే పిన్నెల్లిపై హత్యాయత్నం: రోజా

Jan 7 2020 3:22 PM | Updated on Jan 7 2020 7:14 PM

TDP Leaders Only Attack On Pinneli Rajakrishna Reddy Sasy RK Roja - Sakshi

సాక్షి, మంగళగిరి : రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. పక్కా స్కెచ్‌ ప్రకారమే టీడీపీ గుండాలు హత్యాయత్నంకు దిగారని అన్నారు. మంగళవారం ఆర్‌కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు. పిన్నెలిపై హత్యాయత్నం ముమ్మటికి టీడీపీ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. రైతులు ముసుగులో మీడియాపై కూడా టీడీపీ నేతలే దాడికి దిగారని అన్నారు. పిన్నెల్లి పై దాడికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడుకు అమరావతిపై ప్రేమ ఉంటే అధికారంలో ఉన్న సమయంలో గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. (పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం)

అల్లర్లు అరాచకాలు సృష్టించడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే అని  రోజా అన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలతోనే ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. అమరావతిలో గొడవలు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులను సమర్ధిచింన టీడీపీ నేతలైనా గంటా శ్రీనివాసరావు, కేఈపై ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. గుండా గిరి దాదా గిరి చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోరదని రోజా హెచ్చరించారు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అమాయకుల ప్రాణాలు తీస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement