వైఎస్సార్‌ నాయకులను ‘తోసేయండి’

tdp leaders Enthusiasm on ysrcp leaders - Sakshi

నగర పోలీస్‌ కమిషనర్‌ హుకుం

టీడీపీ నాయకుల అత్యుత్సాహం

పటమట(విజయవాడ ఈస్ట్‌): కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంపై మృతుల బంధువులను పరామర్శించటానికి వచ్చే రాజకీయ పార్టీల నాయకులపై పోలీసులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం జారీ చేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, జోగి రమేష్‌లు రాగా అక్కడే ఉన్న బుద్దా వెంకన్న పోలీసులకు వారిపై ఉసుగొలిపారు. నాయకులు అక్కడికి చేరుకుంటుండగా సీపీ ‘తోసేయండి’ అంటూ ఆదేశించారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్‌కు పరాభవమే..
ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ధనేకుల మురళి, మ హిళా కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశీ, మీసాల రాజేశ్వరరావు  పరామర్శించటానికి రాగా అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు ఫూటుగా మద్యం తాగి పీసీసీ నాయకులకు అడ్డుపడ్డారు. దీంతో వీరి వెంటనే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయటంతో పోలీసులు అక్కడి నుంచి కంచికచర్లకు చెందిన నాయకుడిని పంపించి వేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top