మహానాడుకు రండి పవన్‌కల్యాణ్‌కు టీడీపీ ఆహ్వానం | tdp Invitation to pavan kalyan | Sakshi
Sakshi News home page

మహానాడుకు రండి పవన్‌కల్యాణ్‌కు టీడీపీ ఆహ్వానం

Apr 24 2015 2:39 AM | Updated on Mar 22 2019 5:33 PM

మహానాడుకు రండి  పవన్‌కల్యాణ్‌కు టీడీపీ ఆహ్వానం - Sakshi

మహానాడుకు రండి పవన్‌కల్యాణ్‌కు టీడీపీ ఆహ్వానం

పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరు కావాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె.పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం

హైదరాబాద్: పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరు కావాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె.పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం కోరుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆహ్వానం పంపినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ మహానాడు వచ్చే నెల 27 నుంచి 29 వరకూ విజయవాడలో జరగనుంది.

ఈ మూడు రోజుల మహానాడుకు హాజరైతే సంతోషమని, అలా వీలుకాని పక్షంలో ఎన్‌టీఆర్ జయంతి రోజైన మే 28న హాజరుకావాలని  పవన్‌కు టీడీపీ అగ్ర నాయకత్వం కోరినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణంలో భూ సమీకరణ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకించి ఉద్యమం చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ ఆహ్వానంపై ఇంకా తన అభిమతాన్ని తెలియజేయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement