వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు | TDP cadre attacks again ysr congress party workers | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు

May 21 2014 10:24 AM | Updated on Aug 10 2018 8:46 PM

వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం జిల్లేలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కడప : వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం జిల్లేలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు తమ్ముళ్లు మరోసారి వీరంగం సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికారం వచ్చేసిందన్న అహంతో రెచ్చిపోతున్నారు.

పలు జిల్లాల్లో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులపై భౌతిక దాడులకు దిగుతున్నారు.  ఆస్తులను నష్టపరుస్తున్నారు. కాగా ఘర్షణల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement