టీడీపీ-బీజేపీ పొత్తు ఊహాగానమే: నాగం | TDP-BJP Alliance is a Speculation, says Nagam Janardhan Reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ-బీజేపీ పొత్తు ఊహాగానమే: నాగం

Dec 15 2013 1:17 PM | Updated on Aug 10 2018 6:45 PM

టీడీపీ-బీజేపీ పొత్తు ఊహాగానమే: నాగం - Sakshi

టీడీపీ-బీజేపీ పొత్తు ఊహాగానమే: నాగం

టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానమేనని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి కొట్టిపారేశారు.

హైదరాబాద్: టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాగానమేనని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి కొట్టిపారేశారు. టీడీపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై రేపటి నుంచే శాసనసభలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇందుకోసం అసెంబ్లీ స్పీకర్ చొరవ తీసుకోవాలని కోరారు. వీలైనంత త్వరలో కేంద్రానికి బిల్లు పంపాలని సూచించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించేందుకు అన్ని పార్టీలు సహరించాలని నాగం విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక సమావేశాలు పెట్టించైనా సరే..  తెలంగాణ బిల్లు పాసయ్యేలా బీజేపీ ఒత్తిడి తెస్తుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement