కడుపునకు రంధ్రంతో శిశువు జననం

surgical operation In pedda dornala hospital - Sakshi

కడుపులోని రంధ్రం ద్వారా పేగులు బయటకు..

పొట్ట గోడలు కలుసుకోలేదన్న వైద్యులు

శస్త్ర చికిత్సల నిమిత్తం కర్నూలు వైద్యశాలకు తరలింపు

పెద్దదోర్నాల: కడుపులో ఉండాల్సిన పేగులు బయటే ఉన్న ఓ మగశిశువు  పెద్దదోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం పురుడు పోసుకున్నాడు. పెద్దదోర్నాల మండల పరిధిలోని మర్రిపాలెం గిరిజన గూడేనికి చెందిన తొలిచూలు గర్భిణి కుడుముల రామక్క శనివారం ప్రసవ వేదనతో కాన్పు కోసం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యకేంద్రంలో చేరింది. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ దస్తగిరి, యిలియాజ్‌లు సిబ్బంది పర్యవేక్షణలో కాన్పును నిర్వహించారు. కాన్పు చేసిన వైద్య సిబ్బంది పేగులతో జన్మించిన మగశిశువును చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 

గర్భాశయంలో ఎదుగుదలలో ఉన్నప్పుడు శిశువు కడుపు గోడలు కలుసుకోక పోవటం వల్ల కడుపు పై భాగంలో రంధ్రం ఏర్పడి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. నెలలు నిండకపోవడం, కడుపున కు రంధ్రం ఏర్పటం వల్ల శిశువు  ఈ విధంగా పుట్టిందన్నారు. శస్త్ర చికిత్స ద్వారా చిన్నారికి మెరుగైన వైద్యం అందించవచ్చని, ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉన్నందున ప్రాథమిక జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. చిన్నారిని వైద్యశాలలో శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచి అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్టు డాక్టర్‌ దస్తగిరి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top