పొలం పనులకు రావాలని పిలువగా.. రానని చెప్పిన కుమారుడిని ఓ తల్లి మందలించింది.
పామిడి: పొలం పనులకు రావాలని పిలువగా.. రానని చెప్పిన కుమారుడిని ఓ తల్లి మందలించింది. దీంతో ఇంటర్ చదివే ఆ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో పొలం పనులకు రావాలని తల్లి చిట్టెమ్మ కోరింది.
అందుకు రామాంజనేయులు ససేమిరా అనడంతో మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రామాంజనేయులు తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా, పురుగుల మందు తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగివచ్చిన ఆ దంపతులు నిర్జీవంగా పడి ఉన్న కుమారుడ్ని చూసి గుండెలు బాదుకున్నారు.