డెంగ్యూతో విద్యార్థి మృతి | Student dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో విద్యార్థి మృతి

Sep 28 2015 5:57 PM | Updated on Sep 3 2017 10:08 AM

డెంగ్యూతో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారంలో సోమవారం జరిగింది.

చింతకొమ్మదిన్నె (వైఎస్సార్‌జిల్లా) : డెంగ్యూతో చికిత్స పొందుతూ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిశంకర్ (13) కడపలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కాగా గత వారం రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement