ట్రాక్టర్ బోల్తా : ఏడో తరగతి విద్యార్థి మృతి | Student dies as Tractor overturns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఏడో తరగతి విద్యార్థి మృతి

Aug 3 2015 7:21 PM | Updated on Nov 9 2018 4:36 PM

ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది.

గుంటూరు (మంగళగిరి) : ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని చినకాకాని గ్రామానికి చెందిన గుమ్మా వలిరాజు(14) తన బంధువుల ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలువ గట్టు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో దాని కింద పడి వలిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వలి రాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement