సవతి తల్లి అకృత్యం.. | Step mother harassment girl | Sakshi
Sakshi News home page

సవతి తల్లి అకృత్యం..

Mar 2 2015 8:07 PM | Updated on Sep 2 2017 10:11 PM

పేగు తెంచుకుని పుట్టలేదనేమో ఓ చిన్నారిపై సవితి తల్లి వివక్షను చూపింది.

ప్రకాశం: పేగు తెంచుకుని పుట్టలేదనేమో ఓ చిన్నారిపై సవితి తల్లి వివక్షను చూపింది. తాను ఒక తల్లిననే విషయం మరిచి బాలిక ఒంటిపై వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. సవతి తల్లి అకృత్యానికి తాళ లేక ఆ చిన్నారి అమ్మ.. అమ్మ.. అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్నా ఆమె మనసు కరగలేదు.

ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు శ్రీరాంకాలనీలో సోమవారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న చైల్డ్లైన్ ప్రతినిధులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకవెళ్లారు. బాలికను చిత్రహింసలకు గురిచేస్తున్న సవతి తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement