
రుణమాఫీపై దశలవారీ ఉద్యమం
ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : డ్వాక్రా రుణాల మాఫీ కోసం జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
ఉరవకొండ / ఉరవకొండ రూరల్ :
డ్వాక్రా రుణాల మాఫీ కోసం జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో కలిసి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేస్తామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సోవువారం ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయుం ఎదుట పలువురు మహిళా సంఘాల లీడర్లు, సభ్యులు ఎమ్మెల్యే ఎదుట తమ గోడు వెల్లబోసుకుని, వినతిపత్రం సమర్పించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పుడు గ్రూప్‌కు రూ.లక్ష అని ప్రకటించి అది కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నమ్మి తాము బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్నారు. రుణ మాఫీ ప్రక్రియ జాప్యం కావడంతో రుణాలపై వడ్డీ పెరిగిపోతోందని తమ పొదుపు ఖాతాల్లోంచి డబ్బు జమ చేసుకున్నారన్నారు. తమను నిలువునా మోసం చేశారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రూ.10 లక్షల కోట్లు వెచ్చించి సింగపూర్ తరహాలో స్మార్‌ట సిటీలు నిర్మిస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ర్ట వ్యాప్తంగా రూ.15 వేల కోట్ల డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు లేవని చెప్పడం దారుణమని విరుచుకుపడ్డారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వాన్ని గట్టిగా కోరామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వీఓఏల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తాం
వీఓఏల సవుస్యలను ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోవువారం తహశీల్దార్ కార్యాలయుం ఎదుట రిలేదీక్ష చేస్తున్న వీఓఏలను ఆయన కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మహిళా సంఘాలు, వీఓఏల వ్యవస్థ నిర్వీర్యంగా మారిందన్నారు. 15 నెలలుగా జీతాలు అందకపోవడంతో వీఓఏల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. జీఓ ప్రకారం సెర్‌ప వారు నెలకు రూ.2 వేలు ఇవ్వడానికి కూడా నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రవుంలో జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్యు, ఉప సర్పంచ్ జిలకర మోహన్, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ బసవరాజు పాల్గొన్నారు.