అధికారుల పక్షపాతం సహించం: శ్రీనివాస్‌గౌడ్ | srinivas goud demands to ful fill ias posts | Sakshi
Sakshi News home page

అధికారుల పక్షపాతం సహించం: శ్రీనివాస్‌గౌడ్

Dec 19 2013 12:22 AM | Updated on Jun 18 2018 8:10 PM

అధికారుల పక్షపాతం సహించం: శ్రీనివాస్‌గౌడ్ - Sakshi

అధికారుల పక్షపాతం సహించం: శ్రీనివాస్‌గౌడ్

రాష్ట్ర విభజన కీలక దశలో ఉన్న తరుణంలో కొందరు అధికారులు తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.


 సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన కీలక దశలో ఉన్న తరుణంలో కొందరు అధికారులు తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదోన్నతుల విషయంలో తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా ప్రమోషన్లు, ఖాళీల భర్తీ విషయంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరిని విడనాడాలని ఆయన హెచ్చరించారు. అర్హులైన తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంలో ఆటంకాలు కలగచేయడాన్ని సహించబోమన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఆరు ఐఏఎస్ పోస్టులను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement