శ్రీధర్ బాబు రాజీనామాపై తర్జనభర్జన | Sridhar Babu in a dilemma on his resignation | Sakshi
Sakshi News home page

శ్రీధర్ బాబు రాజీనామాపై తర్జనభర్జన

Jan 2 2014 7:42 PM | Updated on Sep 27 2018 5:56 PM

శ్రీధర్ బాబు రాజీనామాపై తర్జనభర్జన - Sakshi

శ్రీధర్ బాబు రాజీనామాపై తర్జనభర్జన

రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తప్పించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలో మంత్రి శ్రీధర్ బాబు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. దీనిపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం శ్రీధర్ బాబు నివాసంలో కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయినట్టు తెలిసింది. కాగా, త్వరలో శ్రీధర్ బాబు తన రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement