నా జీవితమే ఓ పుస్తకం

నా జీవితమే ఓ పుస్తకం


బుల్లితెర నటి ప్రీతినిగమ్

 

‘సంతోషం’, ‘స్టూడెంట్ నంబర్-1’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన ప్రీతినిగమ్‌ను గుర్తుపట్టారా? వెండితెర కంటే బుల్లితెరపై తళుక్కున మెరిసిన తార ఆమె. అద్భుతమైన పాత్రలతో మహిళాభిమానులను సంపాదించుకున్న ప్రీతి తన జీవితమే ఒక పుస్తకం అంటున్నారు. కౌతవరంలో బుధవారం జరిగిన లఘు చిత్రాల షూటింగ్‌కు వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో

 మాట్లాడారు.  - కౌతవరం (గుడ్లవల్లేరు)

 

 తెలుగులో మీకు పేరు తెచ్చిన సీరియల్స్..?కస్తూరి, రుతురాగాలు, ఆడది, కావ్యాంజలి, ఎండమావులు, చక్రవాకం, చంద్రముఖి, శ్రావణ            సమీరాలు, స్వాతి చినుకులు.

 

 సాక్షి : మీ జీవితంలో సాధించిన విజయాలు?ప్రీతి : మొదట్లో నాకు ఈత రాదు. 30ఏళ్ల వయసులో నేర్చుకున్నా. గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఉంది. వంట, ఇంటి పనులు కూడా అందరి మహిళల్లా చేస్తాను. న్యూస్‌రీడర్‌గా కూడా పనిచేశాను. లండన్, మారిషస్, పారిస్, యూఎస్‌ఏ వంటి దేశాల్లో నృత్యంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాను. విద్యార్థి దశలో ఎన్‌సీసీ, ఫొటోగ్రఫీ, టీటీసీలో కూడా శిక్షణ పొందాను.సాక్షి : సీరియల్స్‌లో లేడీ విలన్‌గా నటించడంపై మీ స్పందన..ప్రీతి : ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటేనే నేను బాగా నటించినట్లు.

 

సాక్షి : మీ కుటుంబ నేపథ్యం ఏమిటీ?ప్రీతి :  మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. భర్త నగేష్‌ది అమలాపురం. ఆయన కూడా నాతో పాటు సీరియల్స్‌లో నటిస్తున్నారు. పాప అతిథిశ్రీ, బాబు ఆర్యన్.సాక్షి : బుల్లితెరలోకి ఎలా అడుగుపెట్టారు.ప్రీతి : నేను డ్యాన్సర్‌ని. సీరియల్స్‌లో నటులకు కూచిపూడి, కథక్, ఫోక్ డ్యాన్సులపై శిక్షణ ఇచ్చేదాన్ని. నా కళ్లు పెద్దవిగా ఉంటాయని సీరియల్స్‌లో నటించమని అడిగారు. తొలిసారిగా 1989లో ‘అంబేద్కర్ డాక్యుమెంటరీ’లో బాల్యంలో ఉన్న అంబేద్కర్‌కు అత్తగా నటించా.

 

సాక్షి : డ్యాన్స్‌లో మీ గురువులు ఎవరు?
 ప్రీతి : కూచిపూడిలో అనిల్‌కుమార్, కథక్   ఏవీ శ్రీధర్ దగ్గర నేర్చుకున్నాను.సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్‌లో నటించారు? ప్రీతి :  వందకుపైగానే. తొలి డైలీ సీరియల్ ‘రుతురాగాలు’. అప్పట్లో హిందీ సీరియల్‌లో కూడా చేశాను.

 

సాక్షి : తొలి సినిమా?ప్రీతి : డెరైక్టర్ శ్యామ్‌బెనగల్‌తో నటించాలని ప్రతి బాలివుడ్ నటికీ ఉంటుంది. ఆయన డెరైక్షన్‌లో 20ఏళ్ల క్రితమే హిందీ ఆర్ట్ ఫిల్మ్‌లో నటించా. హరీబలీ, వెల్డనబ్బా, సంక్రాంతి హిందీ సినిమాల్లో నటించాను. తెలుగులో నా మొదటి సినిమా ‘స్టూడెంట్ నంబరు 1’

 

సాక్షి : ఇంకా ఏయే సినిమాలు చేశారు..ప్రీతి : సంతోషం, శ్రీరామ్, ఔను వాళ్లిద్దరూ ఇష్ట     పడ్డారు, సై, కబడ్డీ కబడ్డీ, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాల్లో నటించా. ఉర్దూలో ఇటీవల నటించిన ‘ఇన్‌కీ ఐసీకీతైసీ’ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నెల 14న స్టెప్నీ అనే మరో సినిమా విడుదల కానుంది. అలాగే, ‘ఐలమ్మ’ పేరిట తెలంగాణలో ఓ సందేశాత్మక రియల్ స్టోరీతో సినిమా విడుదలైంది.సాక్షి : కొత్తనటులకు మీరిచ్చే సందేశం?ప్రీతి : అబద్ధంలో కాకుండా నిజంలో బతకాలి. సంస్కృతీ  సంప్రదాయాల్ని మట్టు పెట్టే విధంగా నాగరికత పేరిట విచ్చలవిడిగా మారకూడదు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top