
త్వరలో కొత్త ఎక్సైజ్ పాలసీ
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు. బెల్టుషాపులను తొలగించేందుకు గ్రామ, మండల కమిటీలను నియమిస్తామని చెప్పారు.
చేనేత రుణాలు 100 కోట్ల రూపాయల వరకు మాఫీ చేయవలస ఉందన్నారు. త్వరలోనే ఈ రుణాల మాఫిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.