మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు.
మద్యం మత్తులో వేధిస్తున్న తండ్రిని ఓ తనయుడు ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని గన్నవారిపల్లి కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓబులేసు (60) మద్యానికి బానిసై ఐదేళ్ల క్రితం తన పెద్ద కుమారుడు రాజును హత్య చేశాడు. భార్య రాజమ్మ, చిన్న కుమారుడు సురేష్ (16)ను కూడా తరచూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రాజమ్మతో గొడవపడ్డాడు. తల్లిని కూడా చంపేస్తాడేమోనన్న ఆందోళనతో సురేష్ రాడ్ తీసుకుని తన తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఓబులేసు ప్రాణాలు విడిచాడు. తానే తండ్రిని చంపానని ఒప్పుకుని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. సురేష్ ఐటీఐ చదువుతున్నాడు.