
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక సచివాలయం రెండో బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంగళవారం పాము ప్రత్యక్షమైంది. కార్యాలయం పని వేళలకు ముందు సిబ్బంది శుభ్రం చేసే సమయంలో కప్‌బోర్డు నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో సిబ్బంది కంగారు పడి సహచరులను పిలిచారు. తర్వాత దానిని చంపి సచివాలయం బయట పడేశారు.