బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి | Six people killed in road accident at bommuru in east godavari district | Sakshi
Sakshi News home page

బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

Oct 15 2013 8:29 AM | Updated on Nov 6 2018 4:55 PM

బొమ్మూరు వద్ద  ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి - Sakshi

బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బొమ్మూరు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భవానీ భక్తులు కూడా ఉన్నారు. మృతులంతా విశాఖపట్నంలోని  గాజువాక ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 

విశాఖ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందారు. హస్పటల్కు తరలిస్తుండగా మరోకరు మరణించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement